ఆయ్‌.. అదరగొడుతున్నారు.. | - | Sakshi
Sakshi News home page

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

Sep 14 2025 3:19 AM | Updated on Sep 14 2025 3:19 AM

ఆయ్‌.

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

జిల్లాలో సెపక్‌ తక్రాకు ఆదరణ

జాతీయ పోటీల్లో క్రీడాకారుల సత్తా

పాఠశాల స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులు

సాక్షి, అమలాపురం: చేతులతో వాలీబాల్‌ ఆడడమే చాలా కష్టం.. అటువంటిది కేవలం కాళ్లు, తల, మొండెంతో మాత్రమే ఆడాలంటే ఇంకెంత కష్టమో కదా. కానీ వీరు కాళ్లతోనే సర్వీసు చేస్తారు. లిఫ్ట్‌ చేస్తారు. బలంగా షాట్‌ కూడా కొడతారు. మినీ వాలీబాల్‌ను తలపించే సెపక్‌ తక్రా ఆటను కాళ్లు, మొండెం, తలతో మాత్రమే ఆడాల్సి ఉంది. ఇది సాధారణమైన ఆట కాదు. క్రీడాకారులు తలపడుతున్న తీరు చూస్తుంటే జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు గుర్తుకు వస్తాయి. మైదానంలో వారు ఆడుతుంటే సర్కస్‌ ఫీట్లు కనిపిస్తాయి. ఇటువంటి అరుదైన ఆటలో కోనసీమ క్రీడాకారులు రాణిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు.. జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణిస్తున్నారు. సత్తాచాటి పతకాలు సాధిస్తున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో సుమారు మూడొంతుల మంది అమలాపురం నుంచి ఎంపికై న వారే ఉన్నారు. జిల్లాలో 2002లో ఈ క్రీడ మొదలు కాగా, ఇప్పటి వరకూ జాతీయ పోటీలకు రాష్ట్ర జట్టుకు 44 సార్లు ఎంపికై న ఘనత ఇక్కడి క్రీడాకారులకు దక్కుతోంది. 160 సార్లు ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. స్థానికంగా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యాండ్ర గౌతమ్‌ కోచ్‌గా ఈ క్రీడకు ప్రాచుర్యం తీసుకు వస్తున్నారు. జిల్లాలో అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, పేరూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఈ క్రీడకు ఇటీవల ఎస్‌జీఎఫ్‌, ఏషియన్‌ గేమ్స్‌, ఆల్‌ ఇండియా, ఆల్‌ ఇండియా పోలీస్‌ గేమ్స్‌లో ప్రవేశం కల్పించడంతో ఆడేవారి సంఖ్య పెరిగింది. సెంట్రల్‌ డిపార్ట్‌మెంట్‌ కోటాలో ఏపీ నుంచి నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని కోచ్‌ గౌతమ్‌ చెబుతున్నారు.

దేశం తరఫున ఆడాలన్నదే లక్ష్యం

నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. నాలుగేళ్ల నుంచి ఈ క్రీడలో తర్ఫీదు పొందుతున్నా. ఇప్పటి వరకూ నాలుగు సార్లు రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. మూడు సార్లు బ్రాంజ్‌ మెడల్‌ సాధించాను. దేశం తరఫున ఆడాలన్నదే నా లక్ష్యం.

–చిట్టూరి శశిధర్‌, అమలాపురం

నాలుగు సార్లు పథకాలు పొందా..

పన్నెండేళ్లుగా సెపక్‌ తక్రా ఆడుతున్నాను. ఇప్పటికి 16 సార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. నాలుగు సార్లు జాతీయ స్థాయిలో పతకాలు సాధించాను. భారత జట్టులో సెంటర్‌ స్థానానికి ఎంపిక కావాలన్నది నా ఆశయం. అందుకు తగినట్టుగా సాధన చేస్తున్నాను.

–కేతా సతీష్‌

ఇసుకపూడి నుంచి జాతీయ పోటీలకు..

నేను ఇసుకపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. అదే పాఠశాలలో శిక్షణ పొందుతూ ఇప్పటి వరకూ రెండుసార్లు జాతీయ పోటీలకు ఎంపికయ్యా. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళలో జరిగిన జాతీయ స్థాయి అండర్‌– 14 సెపక్‌ తక్రా క్రీడా చాంపియన్‌ షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ టీం తరఫున ఆడాను.

–పూర్ణ లక్ష్మీప్రసన్న, ఇసుకపూడి, అంబాజీపేట మండలం

షూటర్‌ కావాలని..

గత మూడేళ్లుగా సెపక్‌ తక్రా ఆడుతున్నా. మూడు సార్లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై , రెండు సార్లు బ్రాంజ్‌ మెడల్‌ సాధించాను. ఈ ఏడాది జనవరిలో జరిగిన స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అండర్‌–14 స్కూల్‌ గేమ్స్‌లో ఆంధ్రా జట్టుకు ఎంపికయ్యా. భారత జట్టు షూటర్‌గా ఎంపిక కావాలనేదే లక్ష్యం. –గోసంగి కృష్ణ సందీప్‌, అమలాపురం

ఖేలో ఇండియాలో సత్తా చాటి..

నేను ఖేలో ఇండియా బీచ్‌ గేమ్స్‌లో సత్తా చాటాను. గత జనవరిలో డామన్‌ డయ్యూలో జరిగిన ఆల్‌ ఇండియా ఖేలో ఇండియా బీచ్‌ గేమ్స్‌లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాను. ఇప్పటి వరకూ నాలుగుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మరింత రాణించేందుకు సాధన చేస్తున్నాను.

–మంచాల చందు, రోళ్లపాలెం, అమలాపురం రూరల్‌

ప్రోత్సాహం మరింత అవసరం

ఉమ్మడి జిల్లాలో సెపక్‌ తక్రా క్రీడకు మా వంతు ప్రో త్సాహం అందిస్తున్నాం. మరింత మంది ప్రోత్సహిస్తే తూర్పు క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లోనూ రాణిస్తారు. పాఠశాల స్థాయి నుంచి ఈ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నాం. కార్పొరేట్‌ కంపెనీలు, చమురు సంస్థలు ఈ క్రీడను ప్రోత్సహించాలి.

–జవ్వాడి తాతబాబు, సెపక్‌ తక్రా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, అమలాపురం

ఆటకు జీవం పోస్తూ..

నేను సివిల్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాను. కోచ్‌గా సెపక్‌ తక్రా క్రీడకు జీవం పోయాలనేదే నా ఆశయం. పదిహేను సార్లు జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నాను. 2012 నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోచ్‌గా సేవలందిస్తున్నాను. నా సారథ్యంలో ఇప్పటి వరకూ 42 సార్లు జాతీయ పోటీలకు, 120 సార్లు రాష్ట్ర పోటీలకు ఉమ్మడి తూర్పు క్రీడాకారులు ఎంపికయ్యారు. తూర్పు క్రీడాకారులను అంతర్జాతీయ పోటీలకు పంపించాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాను.

–యాండ్ర గౌతమ్‌, కోచ్‌

ఆయ్‌.. అదరగొడుతున్నారు..1
1/9

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

ఆయ్‌.. అదరగొడుతున్నారు..2
2/9

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

ఆయ్‌.. అదరగొడుతున్నారు..3
3/9

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

ఆయ్‌.. అదరగొడుతున్నారు..4
4/9

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

ఆయ్‌.. అదరగొడుతున్నారు..5
5/9

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

ఆయ్‌.. అదరగొడుతున్నారు..6
6/9

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

ఆయ్‌.. అదరగొడుతున్నారు..7
7/9

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

ఆయ్‌.. అదరగొడుతున్నారు..8
8/9

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

ఆయ్‌.. అదరగొడుతున్నారు..9
9/9

ఆయ్‌.. అదరగొడుతున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement