
రణభేరి జాతాను విజయవంతం చేయండి
అమలాపురం టౌన్: పాఠశాల విద్యారంగ సమస్యలపై ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ యూటీఎఫ్ నిర్వహించనున్న రణభేరి జాతాను విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు కిశోర్‌కుమార్, జ్యోతిబసు పిలుపునిచ్చారు. శనివారం అమలాపురం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశక్తి కార్యక్రమాలు, పరీక్షల మూల్యాంకనాలు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్, గ్రీన్ పాస్‌పోర్టు మొదలైన బోధనేత పనులతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో నిర్వహించనున్న రణభేరి జాతాలో ఈ సమస్యలన్నీ యూటీఎఫ్ నేతలు ఎలుగెత్తుతారని వారు స్పష్టం చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఏటీవీఏఎస్ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షుడు పెంకే వెంకటేశ్వరరావు, సహాధ్యక్షులు జీవీ రమణ, సీతాదేవి, కోశాధికారి సీహెచ్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.