
ప్లీనరీ సెషన్‌లో ‘ఆదిత్య’ సతీష్ రెడ్డి
గండేపల్లి: న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో ఈ నెల 10న జరిగిన అఖిల భారత మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 52వ జాతీయ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్‌లో నిర్వహించిన ప్లీనరీ సెషన్‌లో ఆదిత్య యూనివర్సిటీ ప్రో చాన్సలర్ ఎన్.సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ ప్రో చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. పారిశ్రామిక, విద్యారంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని, మేనేజ్‌మెంట్, వ్యాపార రంగాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారన్నారు. కార్యక్రమంలో నితిన్ ఆట్రోలే (చీఫ్ స్ట్రాటజీ, కేపీఎంజీ), సంజయ్ కుమార్ సింగ్ (డైరెక్టర్, స్ట్రాటజీ, ఎక్స్‌టర్నల్ రిలేషన్స్, జిందాల్ స్టీల్ లిమిటెడ్), సంజయ్ నారాయణ్ (చీఫ్ జనరల్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), తదితర ప్రముఖులు పాల్గొన్నారన్నారు.