
టీడీపీ, జనసేన నాయకుల వాగ్వాదం
అయినవిల్లి: తొత్తరమూడిలోని షాపు నంబర్ 28లో గురువారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సభకు స్థానిక సర్పంచ్ వార జయసావిత్రి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. వేదికపైకి టీడీపీ నాయకులను పిలిచి, జనసేనకు చెందిన వైఎస్ ఎంపీపీ అడపా నాగభూషణాన్ని పిలవలేదు. దీంతో జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసువచ్చారు. కాగా. ఈ సభను ముక్తేశ్వరం – శానపల్లిలంక రహదారి చెంతన నిర్వహించారు. రహదారి పైనే సభ నిర్వాహకులు కుర్చీలు వేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. సభకు ఎమ్మెల్యే రెండు గంటలు ఆలస్యంగా రావడంతో లబ్ధిదారులు, అధికారులు అవస్థలు పడ్డారు.