
ఎయిడ్స్‌పై అవగాహనకు 5 కె రన్
అమలాపురం రూరల్: ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సీహెచ్‌వీ భరతలక్ష్మి తెలిపారు. ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా మంగళవారం అమలాపురంలోని భట్నవిల్లి జంక్షన్ నుంచి రోళ్లపాలెం వరకూ 5 కె రన్ నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన డాక్టర్ భరతలక్ష్మి మాట్లాడుతూ జిల్లా యువతకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో 17 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసున్న 105 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పురుషులలో ప్రఽథమ బహుమతిని ఎన్.నాగేంద్ర మురళి (అమలాపురం ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజీ), ద్వితీయ బహుమతిని బీఎస్‌ఆర్ రాజు (కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ), మహిళల్లో ప్రఽథమ బహుమతిని జి.రమ్య (రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ), ద్వితీయ బహుమతిని వైపీఎన్‌డీ సంతోషి (కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ) గెలుపొందారు. కార్యక్రమంలో టీబీ అధికారి పి.బాలాజీ, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఎ.బుజ్జిబాబు, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఎంవీ రత్నరాజు పాల్గొన్నారు.