
ఫీజు బకాయిలు చెల్లించాలని ధర్నా
అమలాపురం రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 31 మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ న్యాయం చేయాలని ముత్తాబత్తుల వెంకటేశ్వరరావు, బీఎస్‌పీ నియోజకవర్గ అధ్యక్షుడు పోలమూరి మోహన్‌బాబు ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.