
రెగ్యులేటర్‌ను ఆనుకుని..
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో పి.గన్నవరం ప్రధాన పంట కాలువల వద్ద ఉన్న రెగ్యులేటర్ పక్కనే సాగిన అక్రమ నిర్మాణం ఇది. ప్రధాన పంట కాలువకు అనుబంధంగా ఉన్న చానల్ (మామిడి తోట చానల్)పై సుమారు 1,200 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ చానల్‌కు ఉన్న లాకు పక్కనే ప్రధాన పంట కాలువ వైపు దర్జాగా బడ్డీ పెట్టి పక్కాగా ఆక్రమణ చేశాడు. ఈ కాలువపై పలుచోట్ల ఇదే పరిస్థితి. అక్రమ నిర్మాణాల వల్ల ఇక్కడ లాకులు, రెగ్యులేటర్‌కు గాని, తూరలకు గాని మరమ్మతులు చేసే అవకాశం లేకుండా పోయింది.
కాలువ పొడవునా..
అల్లవరం బెండ కాలువ పరిధిలో అమలాపురం మున్సిపాలిటీనీ ఆనుకుని ఈదరపల్లి నుంచి ముక్కామల వరకు పలుచోట్ల పంట కాలువ ఆక్రమణకు గురైంది. కాలువ పొడవునా ఇళ్లు, ఇతర భవనాల నిర్మాణం జరిగింది. గతంలో ఇక్కడ నిర్మించిన ఇరిగేషన్ భవనాలను సైతం కొంతమంది ఆక్రమించారు. ఇంత జరిగినా ఆ శాఖ అధికారులలో మాత్రం స్పందన లేదు. ఇదే కాలువపై స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు అధికంగా ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఇటీవల వంతెన నిర్మాణాల కోసం మెయిన్ రోడ్డును ఆనుకుని ఆక్రమణలు తొలగించిన అధికారులు ఇరిగేషన్ స్థలాల కబ్జాలపై మాత్రం దృష్టి సారించలేదు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది.

రెగ్యులేటర్‌ను ఆనుకుని..