
కష్టాలు కొనసాగేలా..
అధిక ధరకు విక్రయాలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించేవారు. ఉన్న ఊళ్లోనే సేవలు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎరువులు అందుబాటులో లేకుండా చేసింది. ప్రస్తుతం అన్ని ప్రైవేట్ షాపుల్లో ఎరువులు దొరకడం లేదు. ఉన్న షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
–పెదపూడి బాపిరాజు, అధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ రైతు విభాగం
ఎరువుల సరఫరాకు చర్యలు
గ్రామాల్లో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు ఇండెంట్‌ను గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) పెట్టాలి. ప్రస్తుతం వీఏఏల బదిలీలు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆ ప్రక్రియ ముగుస్తుంది. వీఏఏలు చేరిన వెంటనే ఎరువుల ఇండెంట్ పెట్టించి, రైతులకు కావాల్సిన ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకుంటాం. ఈ లోపు పలు సొసైటీల ద్వారా సరఫరా చేయిస్తున్నాం.
–ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట
కొత్తపేట: తొలకరి పలకరించింది.. ఖరీఫ్ సాగుకు ఆహ్వానం పలికింది.. ఎన్నో ఆశలతో ప్రతి రైతు అడుగు పొలాల వైపు పడింది.. వరి నారుమడులు, పొలాల దమ్ము పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. ఇలా సాగు ఊపందుకుంటుంటే, ప్రభుత్వం నుంచి సన్నద్ధత కరవైంది. నేటికీ రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు మాత్రం అందించడం లేదు. ఎరువులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ, రైతు ప్రోత్సాహక పథకాలను అందించేవారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, తదితర సేవలు సకాలంలో అందించేవారు. ముందుగానే సర్వం సిద్ధం చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే)గా పేరుపెట్టి వాటి ద్వారా సేవలకు మాత్రం మంగళం పాడింది. ఇవి ప్రస్తుతం అలంకారప్రాయంగా మిగిలాయని రైతులు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1,74 లక్షల ఎకరాలు. ఈ సీజన్‌లో యూరియా, కాంప్లెక్స్, డీఏపీ, ఎంఓపీ, సూపర్ ఎరువులు సుమారు 45,775 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. అయితే ఇంకా రైతు సేవా కేంద్రాలకు ఎరువులు రాలేదు. ఎప్పుడొస్తాయో తెలియడం లేదు.
ముందస్తు అంటూ.. నిర్లక్ష్యం చూపుతూ
ముందస్తు సాగుకు వెళ్లాలని అధికారులు చెబుతూనే రైతులకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల సాగు పంట ఆలస్యమవుతుంది. దీనివల్ల పంట చేతికొచ్చే సమయంలో అంటే అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుపాన్లు, భారీ వర్షాలకు పంట తడిసిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పక్కాగా ముందస్తు సాగుకు చర్యలు తీసుకునేది. ఇందులో భాగంగా ముందుగానే సాగునీరు విడుదల చేసేది. సకాలంలో రాయితీపై విత్తనాలు, రసాయన ఎరువులు అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసింది. అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. గత రబీ ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా నేటికీ ఆ డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ ప్రారంభమైనా, రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ద్వారా ఇంకా రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించడం లేదు.
ప్రైవేట్ డీలర్ల హవా
ప్రస్తుతం నాట్లు వేసే సమయం. యూరియా, డీఏపీ అత్యవసరం. ఆర్‌ఎస్‌కేల వద్ద ఎరువులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా దొరకడం లేదు. కొంతమంది వద్దే స్టాక్ ఉంది. తప్పక ఆ షాపులకు వెళితే ఎంఆర్‌పీ రూ.265 ఉన్న యూరియా బస్తా రూ.320 చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఇదేంటని అడిగితే తామే రూ.290కి కొనుగోలు చేశామని, రూ.30 కిరాయి, రూ.5 దిగుమతి చార్జి కలిపి మొత్తం రూ.325 అయ్యిందని అంటున్నారని వాపోతున్నారు. పైగా అవసరం లేకపోయినా యూరియాతో పాటు దానికి అనుసంధానంగా జింకు, సల్ఫర్ వంటి మందులు అంటగడుతున్నారని చెబుతున్నారు.
ఫ ఎరువులు అందక అన్నదాతకు తిప్పలు
ఫ నిరుపయోగంగా
రైతు సేవా కేంద్రాలు
ఫ సాగు కాలం మొదలైనా
కానరాని సన్నద్ధత

కష్టాలు కొనసాగేలా..

కష్టాలు కొనసాగేలా..

కష్టాలు కొనసాగేలా..