
సుగుణారెడ్డికి రెడ్‌క్రాస్ పురస్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ సుగుణారెడ్డికి రెడ్‌క్రాస్ సొసైటీ ఉత్తమ పురస్కారం అందజేసింది. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి రెడ్‌క్రాస్ వార్షిక సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. కాకినాడ రెడ్‌క్రాస్‌ను ప్రథమ స్థానంలో నిలపడంలో కృషి చేస్తున్న సుగుణారెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. అత్యధిక స్థాయిలో ఆదిత్య యూనిట్స్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి, సమాజ సేవలో ముందుంటున్నారని రెడ్‌క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు తెలిపారు.