
బుద్ధుని బోధనలతో ప్రపంచ శాంతి
మాజీ మంత్రి సూర్యారావు
అమలాపురం రూరల్: గౌతమ బుద్ధుని బోధనలతో ప్రపంచ శాంతి సిద్ధిస్తుందని బుద్ధ విహార్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావు అన్నారు. గురువారం అమలాపురం త్రిరత్న బుద్ధవిహార్‌లో ఆషాఢ బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. తొలుత బుద్ధుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ దలైలామా వారసుల ఎంపికలో చైనా పాత్ర ఉండని, దాని సర్వాధికారం దలైలామాదేనని అన్నారు. దాలైలామా మరణానంతరమే వారసులను ఎంపిక చేస్తారన్నారు. మానవాళి హింసను వీడి శాంతి మార్గం వైపు పయనించాలని గౌతమ బుద్ధుడు బోధించారన్నారు. బుద్ధ విహార్ జనరల్ సెక్రటరీ డీబీ లోక్, కమిటీ చైర్మన్ నాగాబత్తుల ప్రసాదరావు, ప్రతినిధులు పెనుమాల చిట్టిబాబు, కాశి వెంకట్రావు, దోనుపాటి నాగేశ్వరరావు, ఈవీవీ సత్యనారాయణ, బత్తుల రాజన్‌బాబు, కోడూరి శ్రీరామ్మూర్తి, గోసంగి ఆనందరావు, దోనుపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.