ఎమ్మెల్యే అనుచరుల నుంచి రక్షణ కల్పించండి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అనుచరుల నుంచి రక్షణ కల్పించండి

Jul 11 2025 5:47 AM | Updated on Jul 11 2025 5:47 AM

ఎమ్మెల్యే అనుచరుల నుంచి రక్షణ కల్పించండి

ఎమ్మెల్యే అనుచరుల నుంచి రక్షణ కల్పించండి

అనపర్తి: తన భార్య కొమ్ము బుజ్జిపై హత్యాయత్నం చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు దుప్పలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి వెంకటరెడ్డి(ఎన్వీ), అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని బాధిత మహిళ భర్త సత్తిబాబు అన్నారు. గురువారం పరామర్శకు వచ్చిన ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయిల్‌ వద్ద ఆయన తమ గోడు చెప్పుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చెప్పుకోవడానికి ఉదయం రామవరంలోని ఆయన ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే తన వద్ద ఉన్న ఫోన్‌ లాక్కుని దానిలో ఉన్న ఫొటో, వీడియో ఆధారాలను డిలీట్‌ చేసి సాయంత్రం ఫోన్‌ తిరిగి ఇచ్చారని సత్తిబాబు ఆరోపించారు. దీనిపై ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తానని ఇజ్రాయిల్‌ వద్ద సత్తిబాబు వాపోయారు. నెల రోజుల క్రితం కుక్కను తప్పించే క్రమంలో తన తోడల్లుడు వీరబాబు వృద్ధుడిని బైక్‌తో ఢీకొట్టాడని, ఆయన మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేయగా వీరబాబు బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. పది రోజులుగా మాజీ సర్పంచ్‌ కుమారుడు ఎన్వీ విపరీతంగా వేధిస్తున్నాడని, దీంతో ఎన్వీ ఇంటికి వెళ్లగా రూ.2 లక్షలు ఇవ్వకపోతే వీరబాబును చంపేస్తామని బెదిరించారని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తన భార్య బుజ్జి, వీరబాబుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సత్తిబాబు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement