
ఐఐఎఫ్‌టీలో సర్టిఫికెట్ ప్రోగ్రాం ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ): స్థానిక జేఎన్‌టీయూలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) క్యాంపస్‌లో గురువారం ఎగుమతి– దిగుమతి నిర్వహణపై సర్టిఫికెట్ ప్రోగ్రాం ప్రారంభమైంది. దీనిని ఆన్‌లైన్‌లో ఐఐఎఫ్‌టీ వీసీ రాకేష్‌మోహన్ జోషి ప్రారంభించి మాట్లాడుతూ ప్రస్తుత భౌగోళిక రాజకీయాలు, దాని అనిశ్చితి తెలుసుకోవడంతో పాటు అంతర్జాతీయ వ్యాపారాన్ని నిర్మించడంలో ఈ ప్రోగ్రామ్ ఏవిధంగా సహాయపడుతుందో వివరించారు. ఈ సందర్భంగా ఐఐఎఫ్‌టీ కాకినాడ హెడ్ రవీంద్రసారథి మాట్లాడుతూ ఎగుమతి, దిగుమతి నిర్వహణలో అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది మంచి విలువైన కోర్సు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలతో పాటు పరిశ్రమల నిపుణులు, విద్యావేత్తలు, సహచరులతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్టిఫికెట్ ప్రోగ్రాం అసిస్టెంట్ ప్రొఫెసర్ సిద్ధార్థ శంకర్‌రాయ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.