
ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ఉచిత సేవలపై
అవగాహన సదస్సు
అమలాపురం టౌన్: ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ధే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్) పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అందిస్తున్న ఉచిత సేవలపై అమలాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు వెంకట్ ఎస్.మేడపాటి ఆధ్వర్యాన అందిస్తున్న ఉచిత సేవలపై ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ కరుణకుమార్ అవగాహన కల్పించారు. విదేశాలకు వెళ్లి మోసపోయిన వారి కుటుంబానికి రూ.10 లక్షల వర కూ ఆర్థిక ఆసరా, ప్రవాసాంధ్ర బీమా, ప్రమాదవశా త్తూ మరణిస్తే రూ.50 వేల పరిహారం, ఉచిత అంబులెన్స్ సేవ, విదేశం నుంచి స్వదేశానికి రాలేక ఇబ్బంది పడుతున్న వారిని రప్పించడం వంటి సేవలను ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ అందిస్తోందని వివరించారు. డీఎస్పీ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ, ఉపాధి కోసం కోనసీమ నుంచి విదేశాలకు వెళ్తున్న వారు అక్రమ ఏజెంట్ల మాయమాటలకు మోసపోతున్నారని, ఆయా దేశాలకు వెళ్లాక తిరిగి స్వదేశానికి రావడానికి పడరాని కష్టాలు పడుతున్నారని అన్నారు. ఇలాంటి సదస్సులు కోనసీమలో మరిన్నిచోట్ల నిర్వహించాలని కోరారు. సదస్సులో పలు స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, మహి ళా పోలీసులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. విదేశాల కు వెళ్లాలనుకునే వారు, విదేశాల్లో ఉన్న వారు సహా యం కోసం ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ నంబర్లు 0863–2340678, వాట్సాప్ 85000 27678లను సంప్రదించాలని సంస్థ ప్రతినిధులు సూచించారు. సంస్థ అందిస్తున్న ఉచిత సేవల సమాచార బ్రోచర్లు విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, కమిషనర్ ఒమ్మి అయ్యప్ప నాయుడు కూడా ప్రసంగించారు.