మహానేతకు అపూర్వ గౌరవం
● డాక్టర్ వైఎస్సార్ స్మృతి మందిరం
నిర్మించి మాట నిలబెట్టుకున్న మల్లాడి
● రేపు ప్రారంభోత్సవం
● తరలిరానున్న నాయకులు, అభిమానులు
యానాం: ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నియోజకవర్గానికి చేసిన మేలుకు కృతజ్ఞతగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సొంత నిధులతో నిర్మించిన వైఎస్సార్ స్మృతి మందిరం నేడు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. పట్టణ పరిధిలో యర్రాగార్డెన్స్‌లో మల్లాడి నివాసం ఎదుటే రూ.లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసి రెండస్తుల్లో నిర్మించారు. ఆదివారం ఈ భవనాన్ని ప్రారంభించనున్న సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ నెల 21 నాటికి 36 ఏళ్లు అవుతోందని, దానిని పురస్కరించుకుని మహానేత రాజశేఖరరెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన పేరున నిర్మించిన ఈ మందిరాన్ని, గో నిలయాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ మందిరంలో మహిళలు, పురుషులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేలా నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహానేతతో తనకున్న అనుబంధంపై రాజన్న స్మృతిలో అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. వైఎస్సార్ దూరమై 16 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆయన స్మృతులు యానాం నిండా ఉన్నాయన్నారు. యానాంకు సాగు, తాగునీటి కొరత లేకుండా శాశ్వత పరిష్కారం, సాగునీటిని 19 నుంచి 30 క్యూసెక్కులకు పెంచడం, మంచినీటి నిల్వ కోసం ఏపీ రైతుల నుంచి సేకరించిన 52.5 ఎకరాల భూమిని యానాంకు కేటాయిండం, ధవళేశ్వరం వద్ద పంప్‌హౌస్ నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు, అక్కడి నుంచి యానాం వరకు 80 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్‌లైన్ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. యానం–ద్రాక్షారామ రోడ్డును బైపాస్ నాలుగు రోడ్లు జంక్షన్ వరకు యానాం ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. సీఎస్సార్ నిధులను సైతం ఆంధ్రాకు 70 శాతం, యానాంకు 30 శాతం కేటాయించారన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం, వైఎస్సార్ ఫ్రెంచి లింకింగ్ చానల్, వైఎస్సార్ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు, వైఎస్సార్ కాలనీ వంటివి ఉన్నాయన్నారు. పుదుచ్చేరి క్యాబినెట్లో తనకు మంత్రి పదవి ఇచ్చేలా అఽధిష్టానాన్ని ఒప్పించడంతో అప్పటిలో తొలిసారిగా తాను మంత్రిగా ప్రమాణం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు.
మహానేతకు అపూర్వ గౌరవం
మహానేతకు అపూర్వ గౌరవం


