రెండు రోజుల క్రితమే నిశ్చితార్థం.. ప్రాణం తీసిన బైక్‌ దావత్‌

Young man Died In Road Accident In Bhupalpally District - Sakshi

సాక్షి, వరంగల్‌:  బైక్‌ దావత్‌.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జయశంకర్‌భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో జరిగింది. స్థానిక ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని కర్కపల్లి గ్రామానికి చెందిన జట్టి సిద్ధు ఇటీవల సెకండ్‌హ్యాండ్‌లో పల్సర్‌–220 బైక్‌ను కొనుగోలు చేశాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు వేముల రాజ్‌కుమార్‌(24)కు బైక్‌ దావత్‌ ఇస్తానని సోమవారం రాత్రి గణపురం తీసుకెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో టవేరా వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో వేముల రాజ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. సిద్ధుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలి పారు. సిద్ధు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

రెండు రోజుల క్రితమే నిశ్చితార్థం
బైక్‌ ప్రమాదంలో మృతిచెందిన రాజ్‌కుమార్‌కు రెండు క్రితమే ఓ అమ్మాయితో నిశ్చితార్థం అయింది. వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలని ఎన్నో కలలు కన్న రాజ్‌కుమార్‌ ఇలా అర్ధాంతరంగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. 
చదవండి: లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top