ఉద్యోగం రాలేదని ఉరేసుకున్నాడు | Young Man Committed Suicide Due To Not Getting Job In Siddipet District | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదని ఉరేసుకున్నాడు

Dec 29 2021 3:10 AM | Updated on Dec 29 2021 3:10 AM

Young Man Committed Suicide Due To Not Getting Job In Siddipet District - Sakshi

శ్రీకాంత్‌(ఫైల్‌)  

దుబ్బాక రూరల్‌: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన బీర్ల ఎల్లం, యాదవ్వ దంపతుల రెండో కుమారుడు శ్రీకాంత్‌ (24) డిగ్రీ పూర్తి చేశాడు. కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు.

పరీక్షలో సరైన ఫలితం రాలేదు. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్‌ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని తన సోదరి ఫోన్‌కు వాట్సాప్‌ పందేశం పంపాడు. కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement