అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

Woman Self Destruction In Adilabad - Sakshi

సాక్షి, నస్పూర్‌(ఆదిలాబాద్‌): అత్తారింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సీసీసీ నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై టీ. శ్రీనివాస్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని నాగార్జున కాలనీకి చెందిన దంసాని మమత(22), ఆమె భర్త నవీన్‌కుమార్, మరిధి వేణులు కలిసి ఒకే క్వార్టర్‌లో నివాసం ఉంటున్నారు. నవీన్‌కుమార్‌ మంథనిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, నవీన్‌ తమ్ముడు వేణుకు తండ్రి లింగయ్య ఉద్యోగం వారసత్వంగా వచ్చింది.

ఈ క్రమంలో నవీన్, వేణు, వారి తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం మమతను వేధించసాగారు. అయినా కట్నం తీసుకురాకపోవడంతో మరిధి వేణుతో మమతకు వివాహేతర సంబంధం అంటగట్టారు. దీంతో మనస్తాపం చెందిన మమత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి దంసాని స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top