ప్రేమ జంటకు దారుణమైన శిక్ష.. చెట్టుకు కట్టేసి.. | Tribal Couple Tied To Tree And Beaten Up In Gujarat | Sakshi
Sakshi News home page

ప్రేమ జంటకు దారుణమైన శిక్ష.. చెట్టుకు కట్టేసి..

Jul 22 2021 2:11 PM | Updated on Jul 22 2021 2:18 PM

Tribal Couple Tied To Tree And Beaten Up In Gujarat - Sakshi

ప్రమాద దృశ్యాలు

గాంధీనగర్‌ : ఇంటినుంచి పారిపోయిన ఓ ప్రేమ జంటకు దారుణమైన శిక్ష విధించారు కొందరు వ్యక్తులు. ఇద్దర్నీ చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణా రహితంగా చితకబాదారు. గుజరాత్‌లోని చౌతౌదేపూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం..  చౌతౌదేపూర్‌లోని చిలియవంత్‌ గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట జులై 18న ఇంటినుంచి పారిపోయింది. వారిని వెతికి పట్టుకున్న కొందరు ఊరికి తీసుకువచ్చారు. చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. పెద్ద పెద్ద కర్రలతో విచక్షణా రహితంగా చావకొట్టారు.

వాళ్లు దెబ్బలు తాళలేక హృదయవిదారకంగా కేకలు పెడుతున్నా వదల్లేదు. చుట్టూ మూగిన జనం అడ్డుచెప్పాల్సింది పోయి సినిమా చూసినట్లు చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావటంతో పోలీసులు చిలియవంత్‌కు వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement