విద్యాబుద్ధలు నేర్పించవల్సిన ప్రధానోపాధ్యాయురాలు కులం పేరుతో విద్యార్ధులను దూషించి, టాయిలెట్లు కడిగించింది..
Chennai Police complaint has been registered against Govt School headmistress తిరుపూర్: తమిళనాడులోని తిరుపూర్‌కు చెందని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్ధులచేత బలవంతంగా టాయిలెట్లు శుభ్రం చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్ధులు శుక్రవారం చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (సీఈఓ) ఆర్ రమేష్‌కు పిర్యాదు చేయడంతో, ప్రధానోపాద్యాయురాలు సప్పెండ్ అయ్యింది.
తమిళనాడులోని తిరుపూర్‌లోని ఇడువై గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు, 400 మంది విద్యార్ధులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు గీత (45) మూడేళ్లగా ఈ పాఠశాలలో పనిచేస్తుంది. ఐతే 9, 10వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఆమెపై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీఈవో) ఆర్ రమేష్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు తమను కులం పేరుతో దుర్భాషలాడిందని, మరుగుదొడ్లు శుభ్రం చేయమని బలవంతం చేసిందని విద్యార్థులు ఆరోపించినట్లు రమేష్ తెలిపారు. పాఠశాలను సందర్శించి విచారణ చేసిన అనంతరం ఆమెను సస్పెండ్ చేసినట్లు, సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు పిర్యాదు చేసినట్లు రమేష్ మీడియాకు తెలిపారు. కాగా ప్రధానోపాధ్యాయురాలుపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (వేధింపుల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే..

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
