సల్లిడీల్స్‌ యాప్‌ సృష్టికర్త అరెస్ట్‌

Sulli Deals app mastermind Aumkareshwar Thakur arrested - Sakshi

ఇండోర్‌లో అంకురేశ్వర్‌ ఠాకూర్‌ పట్టివేత

న్యూఢిలీ/ఇండోర్‌: ముస్లిం మహిళల్ని అవమానించడమే లక్ష్యంగా బుల్లి బాయ్‌ యాప్‌ కంటే ముందే వచ్చిన సల్లి డీల్స్‌ యాప్‌ సృష్టికర్తని మధ్యప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇండోర్‌లో బీసీఏ చదివిన అంకురేశ్వర్‌ ఠాకూర్‌ (26) ఈ యాప్‌ రూపొందించాడని అనుమానంతో  ఢిల్లీ పోలీసులు అతనిని శనివారమే అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అంకురేశ్వర్‌ తన నేరాన్ని అంగీకరించాడని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు (ఐఎఫ్‌ఎస్‌ఒ) కెపీఎస్‌ మల్హోత్రా ఆదివారం వెల్లడించారు.

ముస్లిం మహిళల్ని ట్రోల్‌ చేయడం కోసం తాను ఈ యాప్‌ని రూపొందించినట్టు అతను చెప్పాడన్నారు. సల్లి డీల్స్‌ కేసులో ఇదే మొదటి అరెస్ట్‌. జనవరి 2020లో ఠాకూర్‌ ట్రేడ్‌ మహాసభ అనే ట్విటర్‌ గ్రూపులో చేరాడు.  జ్చnజ్ఛటజీౌn అనే పేరుతో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకొని ఆ గ్రూప్‌లో చేరాడు. ఆ గ్రూపు సభ్యులు ముస్లిం మహిళలని ట్రోల్‌ చేయడంపైనే చర్చలు జరిపేవారు.  ఈ నేపథ్యంలో ఠాకూర్‌ సల్లి డీల్స్‌ యాప్‌ని డిజైన్‌ చేసి గత ఏడాది జులైలో గిట్‌హబ్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఉంచాడు.

  సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్చి వేలానికి పెట్టాడు. ఈ విషయంలో మీడియాలో ప్రధానంగా రావడంతో అతను తన సోషల్‌ మీడియా అకౌంట్లన్నీ డిలీట్‌ చేశాడు. కాగా పోలీసుల అదుపులో ఉన్న బుల్లి బాయ్‌ యాప్‌ సృష్టికర్త నీరజ్‌ బిష్ణోయ్‌ విచారణలో తాను సల్లిడీల్స్‌ను రూపొందించిన వారితో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఠాకూర్‌ని అరెస్ట్‌ చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top