తీరని శోకం.. రాములవారి భజనలో అపశ్రుతి..

కొణిజర్ల: పండుగపూట విషాదం నెలకొంది. ఆలయంలోకి బొలేరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లి పాడులో ఆదివారం రాత్రి చోటు చేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడు అభయాంజనేయ స్వా మి దేవాలయంలో ఏర్పాటు చేసిన భజనకు తుమ్మలపల్లికి చెందిన 25 మంది వచ్చారు. కొందరు పిల్లలను వెంటబెట్టుకొచ్చారు.
పెద్ద లు భజన చేస్తుండగా, పిల్లలు ఆడుకుంటున్నా రు. రాత్రి 9 దాటాక ఖమ్మం నుంచి దిద్దుపూడికి వేగంగా వెళ్తున్న బొలేరో ఆలయ సమీపానికి రాగానే అదుపు తప్పింది. పక్కన ఉన్న వి ద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, అదేవేగంతో దేవాలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆలయం గో డ విరిగి పక్కనే ఆడుకుంటున్న పగడాల దేదీప్య(9), పగడాల సహస్ర(7)తో పాటు ఇజ్జగాని అలేఖ్యపై పడింది. తీవ్రగాయాలైన చిన్నారులను ఖమ్మం తరలిస్తుండగా దేదీప్య, సహస్ర మృతి చెందారు. అలేఖ్య గాయాలతో బయట పడింది. వాహనం డ్రైవర్ మద్దెల పోతురాజు, వాహనంలో ఉన్న నాగటి వెంకన్న సైతం తీ వ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం తరలించారు.
తీరని శోకం..
తుమ్మలపల్లికి చెందిన పగడాల ఆదినారాయణ, శిరీష దంపతులకు ఇద్ద రూ ఆడపిల్లలే. ఆదినారాయణ పెయింటర్‌గా పనిచేస్తూనే ఆలయాల్లో భజనలకు తబలా వాయిద్యకారుడిగా వెళ్తుం టాడు. పల్లిపాడులో భజనకు భార్యాభర్తలు వెళ్తూ, కుమార్తెలు దేదీప్య, సహస్రను కూడా వెంట తీసుకెళ్లారు. ఊహించని విధంగా జరి గిన ప్రమాదంలో చిన్నారులిద్దరూ మరణించడంతో ఆ దంప తుల దుఃఖానికి అంతులేకుండా పోయింది.