సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  జిల్లాలోని ఐ.పోలవరం మండలంలో యానం బాలయోగి బ్రిడ్జ్‌పై ఓ  బైక్‌ను ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో చిన్నారి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటన స్థలాన్ని పరిశీలిచారు.
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
