దారుణం: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి

పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య
భూతగాదాలో కలగజేసుకుని వేధింపులు
వలిగొండ: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని అరూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అరూర్‌కు చెందిన సుద్దాల యాదమ్మ(43)కు సంబంధించిన భూతగాదాలో నరసాయగూడెంకు చెందిన రాజకీయ నాయకుడు తుమ్మల నర్సయ్య కలగజేసుకొని విసిగిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం రాత్రి తన ఇంట్లో పురుగు మందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే యాదమ్మను 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు.
సంబంధిత వార్తలు