పోలీస్‌ కొంపముంచిన వివాహేతర సంబంధం

Police Suspended Increment For One Year Due To Illicit Affair - Sakshi

ముంబై : వివాహేతర సంబంధం ఓ పోలీస్‌ అధికారి కొంపముంచింది. ఉద్యోగ జీవితంలో మంచి భవిష్యత్తు లేకుండా చేసింది. వివరాలు.. మహారాష్ట్ర, ముంబైకి చెందిన అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ధన్‌రాజ్‌ ప్రభాలే అక్కడి నాగ్‌పాద పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఓ మహిళ తన క్యాటరింగ్‌ బిజినెస్‌కు సంబంధించి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. దాన్ని చూసిన ధన్‌రాజ్‌ ఆమెకు బిజినెస్‌ విషయంలో సహాయం చేస్తానంటూ పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాతినుంచి ఇద్దరూ మాట్లాడుకోవటం, అప్పుడప్పుడు కలుసుకోవటం చేసేవారు. అయితే, తనకు సహాయం చేస్తానంటూ ధన్‌రాజ్‌ వాడుకున్నాడని ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై విచారణకు ఆదేశించగా ధన్‌రాజు దోషిగా తేలాడు. దీంతో అధికారులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సంవత్సరం పాటు ఇంక్రిమెంట్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘ ఇది చాలా పెద్ద శిక్ష. ప్రమోషన్‌ విషయంలో భారీ దెబ్బ పడుతుంది. డీజీ ఇన్‌సిగ్నియా వంటి కొన్ని మెడల్స్‌ అందుకోవటానికి కూడా అతడు అనర్హుడు’’అని తెలిపారు.

చదవండి : చుట్టపుచూపుగా వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న మహిళ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top