విషాదం: ఫోన్‌ బ్యాటరీని నాలుకతో నాకటంతో.. | Phone Battery Explodes On Boys Face In UP | Sakshi
Sakshi News home page

విషాదం: ఫోన్‌ బ్యాటరీని నాలుకతో నాకటంతో..

Mar 28 2021 4:48 PM | Updated on Mar 28 2021 9:31 PM

Phone Battery Explodes On Boys Face In UP - Sakshi

బ్యాటరీ పవర్‌ను పరీక్షించడానికి దాన్ని నాలుకతో నాకాడు.....

మీర్జాపూర్‌ : ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు తన ఫోన్‌ బ్యాటరీని నాలుకతో నాకగా అది పేలింది. దీంతో అతడు మృత్యువాత పడ్డాడు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మీర్జాపూర్‌ జిల్లా మత్వార్‌ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు మోనూ శుక్రవారం ఉదయం తన సెల్‌ఫోన్‌ బ్యాటరీకి జాదూ చార్జర్‌లో చార్జింగ్‌ పెట్టాడు. ఓ గంట తర్వాత బ్యాటరీ పవర్‌ను పరీక్షించడానికి దాన్ని నాలుకతో నాకాడు. ‘‘ఢాం!!’’ అని పెద్ద శబ్ధం చేస్తూ బ్యాటరీ ముఖం మీదే పేలింది. దీంతో ముఖానికి తీవ్రగాయాలై బాలుడు మరణించాడు.

శబ్ధం విన్న కుటుంబసభ్యులు అతడి వద్దకు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మోనూ అ‍ప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కుటుంబసభ్యులు మోనూ అంత్యక్రియలు జరిపించారు.

చదవండి : తప్పించుకున్న 72 గంటల్లోనే ఎన్‌కౌంటర్‌లో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement