నన్నే కాదంటావా.. ఆసుపత్రిలో నర్సుపైకి దూసుకెళ్లి.. | Nurse Attacked By Lover Rejecting Marriage proposal At Karnataka | Sakshi
Sakshi News home page

నన్నే కాదంటావా.. ఆసుపత్రిలో నర్సుపైకి దూసుకెళ్లి..

Published Fri, Nov 29 2024 7:19 AM | Last Updated on Fri, Nov 29 2024 9:48 AM

Nurse Attacked By Lover Rejecting Marriage proposal At Karnataka

బెంగళూరు: ఇటీవలి కాలంలో తమ ప్రేమను నిరాకరించారన్న కారణంగా యువతులపై దాడి ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో ఓ నర్సు.. పెళ్లికి నిరాకరించిదనే కారణంగా ఆమెపై దాడి చేశాడు యువకుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  బెళగావిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం.. ప్రసాద్ జాదవ్ అనే వ్యక్తి అక్టోబర్ 30వ తేదీన బెళగావిలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. తాను తీసుకెళ్లిన బ్యాగులో నుంచి ఓ రాడును తీసి అక్కడే ఉన్న నర్సుపై దాడి చేయబోయాడు. ఈ క్రమంలో దాడిని గమనించిన బాధితురాలు.. అతడిని ఎంతో ధైర్యంగా అడ్డుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి లోపల ఉన్న మిగతా సిబ్బంది కూడా అతడిని అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రసాద్ జాదవ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అయితే, ప్రసాద్ జాదవ్ కొద్దిరోజులుగా సదరు నర్సును వేధింపులకు గురిచేశాడు. ఆసుపత్రికి దగ్గరలోనే ప్రసాద్ నివాసం ఉండటంతో తరచూ నర్సును ఫాలో చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడని బాధితురాలు తెలిపింది. ఇక, ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితులు.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు ప్రసాద్ జాదవ్ ను హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న ప్రసాద్.. నర్సుపై దాడి చేశాడు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement