భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య | Navya Geetha Suicide With Dowry Harassment In Visakhapatnam | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

Oct 9 2021 8:34 AM | Updated on Oct 9 2021 8:34 AM

Navya Geetha Suicide With Dowry Harassment In Visakhapatnam - Sakshi

సాక్షి, అనకాపల్లి టౌన్‌: వరకట్న వేధింపులకు తాళలేక పురుగుమందు తాగిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. పట్టణ ఎస్‌ఐ ధనుంజయ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాంధీనగరం ఇన్‌కంట్యాక్స్‌వీధికి చెందిన మొల్లి నవ్యగీత(29)కు, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటకు చెందిన ప్రైవేట్‌ పాఠశాల టీచర్‌ దేవర నాగేశ్వరరావుతో 2011లో వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడున్నాడు.

నిత్యం నాగేశ్వరరావు నవ్యగీతను వరకట్నం కోసం వేధిస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. వీటిని తాళలేక ఆమె ఈనెల ఒకటో తేదీన ఇంట్లో పురుగు మందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన నవ్యగీతను హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు ఎస్‌ఐ చెప్పారు. మృతురాలి తల్లి వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement