కలిచివేసే ఘటన: వైద్యుడి కోసం పడిగాపులు...చివరికి తల్లి ఒడిలోనే ఆ చిన్నారి... | Sakshi
Sakshi News home page

కలిచివేసే ఘటన: వైద్యుడి కోసం పడిగాపులు...చివరికి తల్లి ఒడిలోనే ఆ చిన్నారి...

Published Thu, Sep 1 2022 1:10 PM

Medical Negligence 5 Years Old Boy Died Mothers Arms In Madhya Pradesh - Sakshi

భోపాల్‌: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని సంజయ్‌ పాండ్రే కుటుంబం తమ ఐదేళ్ల రిషి అనే చిన్నారిని స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. ఐతే వారు ఆస్పత్రి వెలుపలే గంటలతరబడి వేచి ఉన్నా వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో ఆ చిన్నారికి సకాలంలో వైద్యం అందలేదు.

దీంతో ఆ చిన్నారి తల్లి ఒడిలోనే విగతజీవిగా మారాడు. ఆ ఆరోగ్య కేంద్రంలో ఒక్క వైద్యడు కూడా సమయానికి చికిత్స అందించకపోవడంతో తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ చిన్నారి నిస్సహాయంగా మృతి చెందాడు. ఆఖరికి ఆ చిన్నారి మరణించిన కొన్ని గంటల తర్వాత కూడా ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేరని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఐతే డ్యూటిలో ఉండాల్సిన వైద్యాధికారి ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని వివరించమనగా...తన భార్య ముందు రోజు ఉపవాసం ఉందని అందువల్ల మెడికల్‌ సెంటర్‌కి రావడం ఆలస్యం అయ్యిందని చెప్పినట్లు సమాచారం.

(చదవండి:  గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి)
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement