పాత అనుచరులే  పగ పెంచుకున్నారు

Mahabubabad: Cops Crack Down Councillor Murder Case Arrest Seven - Sakshi

తమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని హతమార్చారు 

రవినాయక్‌ హత్య కేసును ఛేదించిన మహబూబాబాద్‌ పోలీసులు  

ఏడుగురు నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్‌చంద్ర  

సాక్షి, మహబూబాబాద్‌:  మహబూబాబాద్‌ మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ రవినాయక్‌ను అతడి పాత అనుచరులే హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. తమ వ్యాపారాలకు అడ్డొస్తున్నాడని, పోలీసులతో కేసులు పెట్టిస్తున్నాడనే కోపంతో కక్ష పెంచుకున్నారని చెప్పారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. 

కర్ర వ్యాపారానికి అడ్డుపడుతున్నాడని.. 
‘రవినాయక్‌కు గతంలో మహబూబాబాద్‌ శివారు పత్తిపాక మంగలికాలనీకి చెందిన భూక్య విజయ్, బాబునాయక్‌ తండాకు చెందిన భూక్య అరుణ్‌లతో మంచి సంబంధాలు ఉండేవి. అతడి వ్యాపారాలకు వీరు సహకరించేవారు. అయితే రవినాయక్‌ పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడంతో విజయ్, అరుణ్‌ సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. ఇది వారి మధ్య మనస్పర్థలు తెచ్చింది. ఈ క్రమంలో కర్ర వ్యాపారం చేస్తున్న విజయ్‌ను అటవీశాఖ అధికారు లు పట్టుకున్నారు.

రవినాయక్‌ ఇచ్చిన సమాచారంతోనే పట్టుకున్నారని విజయ్‌ పగ పెంచుకున్నాడు. ఇక బెల్లం వ్యాపా రం చేస్తున్న అరుణ్, బాబునాయక్‌ తం డాకు చెందిన బాలరాజు కూడా రవినాయక్‌ తమను ఇబ్బందిపెడ్తున్నాడని కక్ష్య పెంచుకున్నారు. ముగ్గురూ కలిసి రవినాయక్‌ హత్యకు ప్రణాళిక వేశారు. అరుణ్, విజయ్, బాలరాజు రెక్కీ నిర్వహించారు.

ఈ క్రమంలో చింటూ అలియాస్‌ సతీశ్, అజ్మీరా రవికుమార్, మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన కారపాటి సుమంత్‌ సహకారం తీసుకున్నారు. కారుతో ఢీకొట్టి చంపాలని భావించారు. కానీ గురువారం ఉదయం రవినాయక్‌ పత్తిపాక రోడ్డు నుంచి వెళ్తున్న విషయాన్ని గమనించిన అరుణ్‌.. అతడిని కారులో వెంబడిస్తూ విజయ్‌కు సమాచారం ఇచ్చాడు. విజయ్‌ ట్రాక్టర్‌తో ఎదురుగా వచ్చి రవినాయక్‌ను ఢీకొట్టాడు. కిందపడిపోయిన రవినాయక్‌పై విజయ్‌ గొడ్డలితో, అరుణ్‌ కత్తితో దాడి చేసి పరారయ్యారు. 

మామకు ఫోన్‌చేసి పారిపోతుండగా.. 
రవినాయక్‌ను హత్య చేసిన విషయాన్ని విజయ్‌ తన మామ, డోర్నకల్‌ మండలం గొల్లచర్లకు చెం దిన గుగులోత్‌ బావుసింగ్‌కు చెప్పా డు. బావుసింగ్‌ హత్యస్థలానికి వచ్చి ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. పారిపోతున్న విజయ్, అరుణ్‌లను జంగిలిగొండ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఒక కారు, కత్తి, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రవినాయక్‌ హత్యకు సహకరించిన బాలరాజు, గుగులోతు చింటూ, కా రపాటి సుమంత్, అజ్మీరా రవికుమా ర్, బావుసింగ్‌లను అరెస్టు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top