ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య | Intermediate Student Ends Life In Bapatla district | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Apr 14 2025 5:32 AM | Updated on Apr 14 2025 5:32 AM

Intermediate Student Ends Life In Bapatla district

చెరుకుపల్లి: ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫె­యిల్‌ కావడంతో మనస్తాపానికి గురైన ఓ వి­ద్యా­ర్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నా­డు.

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామానికి చెందిన మున్నం గోవర్ధనరెడ్డి, పార్వతమ్మ దంపతుల చిన్న కుమారుడు ప్రశాంత్‌రెడ్డి(18) చెరుకుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. శనివారం ఇంటర్‌ ఫలితాలు విడుదల కాగా, ప్రశాంత్‌రెడ్డి ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యాడు. మనస్తాపానికి గురైన ప్రశాంత్‌ రెడ్డి... ఆదివారం ఉదయం తన తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement