
ఫైల్ ఫోటో
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్‌పోస్ట్ వద్ద ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి ఏలూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. కాగా నిన్న దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళన చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకుగాను దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు.