తండ్రి మృతి..అప్పులు తీర్చలేక కొడుకు ఆత్మహత్య | 33 Year Old Man Suicide Due To Debut In Nizamabad | Sakshi
Sakshi News home page

తండ్రి మృతి..అప్పులు తీర్చలేక కొడుకు ఆత్మహత్య

Mar 2 2021 9:02 AM | Updated on Mar 2 2021 11:03 AM

33 Year Old Man Suicide Due To Debut In Nizamabad - Sakshi

తండ్రి మాట నిలబెట్టుకోలేకపోయా. జై కేసీఆర్‌.. టీహెచ్‌ఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు జై.. జై తెలంగాణ’’ అని రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది.

భిక్కనూరు నిజామాబాద్‌ : ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో మండలంలోని భాగిర్తిపల్లికి చెందిన గంగయ్యగారి నర్సింలు(33) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. నర్సింలు తండ్రి లక్ష్మయ్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయంలో జరిగిన ఖర్చుకు అప్పులు చేశారు. అప్పులు చెల్లింపు విషయంలో కుటుంబంలో తగాదాలు ఏర్పడ్డాయి.

అప్పులు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన నర్సింలు తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘‘నా చావుకు ఎవరు కారణం కాదు. అందరిని బాధపెట్టాను. తండ్రి మాట నిలబెట్టుకోలేకపోయా. జై కేసీఆర్‌.. టీహెచ్‌ఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు జై.. జై తెలంగాణ’’ అని రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. కాగా నర్సింలుకు ఆరు నెలల క్రితం వివాహామైనట్లు సమాచారం. 

చదవండి :  (కులాంతర వివాహం..మనస్తాపంతో ఆత్మహత్య!)
(డెత్‌నోట్‌ రాసి.. ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య)

Advertisement
 
Advertisement
Advertisement