Cocaine: 30 కిలోల కొకైన్‌ అక్రమ రవాణా

1 Million USD Worth Of Cocaine Found Floating In The Sea Near Florida Keys - Sakshi

$1 million worth of cocaine Found Floating on Florida Ocean: నీటిపై తేలియాడుతున్న దాదాపు 7 కోట్ల విలువైన 30 కేజీల కొకైన్‌ను అందజేసిన వ్యక్తిని పోలీసులు ప్రశంసించారు. వివరాల్లోకెళ్తే..

ఫ్లోరిడా కీస్ సమీపంలోని సముద్రంపై తేలియాడుతున్నట్లు కనుగొన్న మిలియన్ డాలర్ల విలువైన కొకైన్‌ను అందజేసిన వ్యక్తిని పోలీసులు ప్రశంసించారు. సముద్రంలో సరదాగా బోటింగ్‌కు వెళ్లిన వ్యక్తికి 30 కిలోల కంటే ఎక్కువ బరువున్న డ్రగ్స్‌ను ప్యాక్‌ చేసి ఉండటం గమనించాడు. వెంటనే ప్యాకేజీ గురించిన సమాచారాన్ని యూఎస్‌ బోర్డర్ పెట్రోల్‌కు తెలియజేశాడు. డ్రగ్స్‌ని వెలికి తీయడంలో యూఎస్‌ కోస్ట్ గార్డ్ సహాయం చేసింది. దీనివిలువ దాదాపు 7 కోట్లు (1 మిలియన్ డాలర్లు) ఉంటుందని అధికారులు తెలిపారు.

చీఫ్ పెట్రోల్ ఏజెంట్ థామస్ జి మార్టిన్ 24 ఇటుకల రూపంలో ఉ‍న్న కొకైన్‌కు సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియాలో ట్వీట్ చేశాడు. ‘వారాంతంలో ఓ సహృదయుడు ఫ్లోరిడా కీస్ సమీపంలో సముద్రంలో తేలుతున్న 1 మిలియన్ డాలర్ల కొకైన్‌ను కనుగొన్నాడని రాసుకొచ్చాడు. ఐతే ఫోరిడాలో గుర్తుతెలియని వ్యక్తులు డ్రగ్స్‌ను భారీ స్థాయిలో రవాణా చేస్తూ దొరికిపోవడం కొత్తేమీ కాదు. ఈ యేడాది ప్రారంభంలో కూడా ఒక స్నార్కెల్లర్ 1.5 మిలియన్‌ డాలర్ల విలువైన కొకైన్‌ను కనుగొన్నాడు. మరో సంఘటనలో గత ఏడాది ఆగస్టులో ఫ్లోరిడాలోని ఓ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి 30 బిగుతుగా చుట్టిన బ్యాగులు కనిపించాయి.

చదవండి: ట్రక్‌ యాక్సిడెంట్‌.. 53 మంది దుర్మరణం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top