● సకల వర్గాలకు సంక్షేమం అందించిన నేత ● నేడు వైఎస్ జగన్
మా ఇంటి దీపం వెలిగించాడు
శాంతిపురం: ‘‘నాకున్న 1.5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుని భార్య జయంతి, కొడుకు పృథ్విఆదిత్యతో ఉన్నంతలో సంతోషంగా జీవించేవాడిని. మూడేళ్ల క్రితం నా కొడుకు ఆనారోగ్యానికి గురయ్యాడు. నెల రోజుల పాటు మేము ఆస్పత్రుల చుట్టూ తిరిగితే ఊపిరి తిత్తులు తీవ్రమైన ఇన్పెక్షన్‌కు గురైనట్టు తేల్చారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం గురించి తెలిసినా, నా బిడ్డ ఎదుర్కొంటున్న జబ్బుకు చికిత్సలు చేసే ఆస్పత్రులు స్థానికంగా లేక ఇబ్బంది పడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో వైద్యం కోసం చేసిన ఖర్చులు తమ శక్తికి మించి అయిన వారి సాయం తీసుకున్నా అదీ సరిపోలేదు. నానాటికీ అనారోగ్యం ముదురుతూ శ్వాస తీసుకోవడానికి అల్లాడుతున్న నా చంటి బిడ్డను చూస్తూ ఉండలేక సతమతమయ్యారు. చివరకు బెంగళూరులోని రెయిన్‌బో అస్పత్రికి తీసుకువెళితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించారు. రూ.10 లక్షలకు పైగా విలువైన చికిత్సలను ఉచితంగా అందించడంతో పృథ్విఆదిత్య గండం నుంచి గట్టెక్కాడు. ఇప్పుడు మూడేళ్ల వయసున్న బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పట్లో తమ కష్టాన్ని, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి అందిన సాయాన్ని తలుచుకుని ధర్మేంద్ర దంపతులు చేతులు జోడించి నాటి సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. మా లాంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి మంచి మనసున్న పాలకులే కావాలి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.’’
– ధర్మేంద్ర, ఆరిముత్తనపల్లి, శాంతిపురం మండలం
తిరుపతి, సాక్షి ప్రతినిధి: సకల వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన నాయకుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనం గుండెల్లో నిలిచిపోయారు. 18 నెలల నేటి చంద్రబాబు ప్రభుత్వ పాలనను, నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనతో పోల్చుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా నాటి సంక్షేమ పాలనను గుర్తుచేసుకుంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకుడిగా అభివర్ణిస్తున్నారు. నాడు ఐదేళ్లలో చేసిన సంస్కరణల గురించి చర్చించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చేసి చూపించిన నాయకుడిగా నిలిచిపోయారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలో వేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని మహిళలు కీర్తిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. వలంటీర్లు నియమించి కులమతాలు పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు అందించారు. నాడు– నేడు ద్వారా ప్రభుత్వ బడులు, ఆస్పత్రులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. విద్యా వ్యవస్థ బాగు కోసం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేశారు. 17 మెడికల్ కళాశాలలు, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మాటలు, ప్రకటలతో కాకుండా మహిళా సాధికారతను చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేరునే ఇచ్చి సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు. అటువంటి నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
● సకల వర్గాలకు సంక్షేమం అందించిన నేత ● నేడు వైఎస్ జగన్


