రైతు బతుకును పండగ చేశాడు
కాణిపాకం: ‘‘రైతు బతుకు జగనన్న పండగ చేశాడు. నేను పుట్టినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసం జగన్‌మోహన్ రెడ్డి లాగా ఇంత పరితపించే మరో నాయకుడిని చూడలేదు. మాకు ముగ్గురు పిల్లలు. వాళ్లకు పెళ్లయి పిల్లలున్నారు.ఊరు చివరన మాకు 2.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో చెరుకు, వరి పండిస్తున్నాం. అడపాదడపా రాగులు సాగు చేస్తాం. 2019కి ముందు వ్యవసాయ ఆధారిత మందులు, ఎరువుల కోసం తమిళనాడుకు వెళుతున్నాం. 8 కిలోమీటర్ల దూరం ఆటోలో వెళ్లి మందులు, ఎరువులు తెచ్చుకునేవాళ్లం. అప్పట్లో పండించే పంట తెగుళ్ల నుంచి కాపాడుకోలేకపోయాం. పంట ఎత్తిపోతే నష్టపరిహారం కూడా అందించే వారు కాదు. పంటపై తీసుకున్న రుణాలకు రుణమాఫీ కాగాపోగా అప్పుల పాలయ్యాం. 2019 తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. జననేత పాలనలో వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని ఆయన నిరూపించారు. పంట సాగుకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా అందించారు. మా గ్రామ సమీపంలో శ్రీకావేరిరాజుపురం వద్ద రైతు భోరోసా కేంద్రాన్ని నిర్మించారు. ఆర్బీకేలో నాణ్యత గల ఎరువులు, యూరియా, వేరుశనగ, కంది, జనుము, మినుములు, అలసంద వంటి పలు రకాల విత్తనాలను తీసుకున్నాం. యంత్రపరికాలు కూడా అందించారు. రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.13.500 మా బ్యాంకు ఖాతాకే పడేది. సాగు చేసే పంటకు బీమా వసతి కల్పించారు. పంట నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చేవారు. రైతు భరోసా కేంద్రం వచ్చాక పాడి ఆవులకు ఊళ్లోనే వైద్యం చేసేవాళ్లు వచ్చారు. దాణాలు, సీజనల్ వ్యాధుల నివారణకు మందులు ఉచితంగా వేసేవారు. ఫోన్ చేస్తే పశు సంచార వాహనం ఇంటి వద్దకే వచ్చేది. ఇలాంటి గొప్ప సేవలు అందడంతో మేము కూడా కొండత భరోసా వచ్చింది. పేదల అభ్యున్నతే ధ్యేయంగా పాటుపడిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.’’
– రాజేంద్ర,
ఎస్‌కేఆర్‌పురం, పాలసముద్రం మండలం


