హెచ్‌ఎంపై విచారణ
– 8లో
– 8లో
వీకోటప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంపై చిత్తూరు డీవైఈవో పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు.
ఇంటిల్లిపాదికీ సంక్షేమం
వరదయ్యపాళెం: ‘మాది తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలంలోని చిన్నపాండూరు గ్రామం. మాది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. నా భర్త తో పాటు ఇద్దరు కుమార్తెలు గురుప్రియ, చంద్రుప్రియ, కుమారుడు వంశీ ఉన్నారు. మాతో పాటు నా భర్త తల్లి రుక్ష్మిణి ఉంది. మేమందరం ఒకే ఇంట్లో ఉంటాం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నా భర్తకు రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500 చొప్పున ప్రతి సంవత్సరం అందింది. నాకు సున్నా వడ్డీ పథకం కింద రూ.2వేలు, బీఫార్మసీ చదువుతున్న పెద్ద కుమార్తె గురుప్రియ, ఈసీఈ చదువుతున్న ద్వితీయ కుమార్తె చందుప్రియకు జగనన్న విద్యాదీవెన పథకం దారా లబ్ధి చేకూరింది, ఇంటర్మీడి యట్ చదువుతున్న కుమారుడు వంశీకి అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15వేల చొప్పున మా బ్యాంకు ఖాతాలో జమైంది. మా అత్తమ్మ రుక్మిణికి వితంతు పింఛను కింద ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ముట్టింది. ఇలా ఆరుగురు కుటుంబ సభ్యులకు ఏడాదికి రూ.1,07,000, ఆర్థిక సహాయం అందేది. జగనన్న పాలనలో 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు అందుకున్నాం. మా కుటుంబానికి సాయం చేసి, అండగా నిలబడిన జగనన్న వెయ్యేళ్లు వర్ధిల్లాలి. అన్నా నీకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.’’ – భాను కుటుంబం,
చిన్నపాండూరు, వరదయ్యపాళెం మండలం


