పేద విద్యార్థులకు జగనన్న బాసట | - | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు జగనన్న బాసట

Dec 21 2025 9:23 AM | Updated on Dec 21 2025 9:23 AM

 పేద విద్యార్థులకు జగనన్న బాసట

పేద విద్యార్థులకు జగనన్న బాసట

తిరుపతి సిటీ : ‘‘తిరుపతి కొర్లగుంటకు చెందిన నిరుపేద కుటుంబం మాది. అమ్మానాన్న ఇద్దరూ భవన నిర్మాణ కూలీలు. నేను, తమ్ముడు ఇద్దరం సంతానం. వారి చేతి కష్టంతో మమ్మలను చదివిస్తూ వచ్చారు. నేను 2019లో నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాను. గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఫీజు చెల్లించలేనిస్థితిలో ఆశలు వదులుకున్నాను. అమ్మానాన్నతో పాటు నేనూ కొన్ని రోజులు పనికి వెళ్లాను. ఆ సమయంలో జగనన్న 2019లో సీఎం అయిన వెంటనే టీడీపీ ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించారు. దీంతో కళాశాల యాజమాన్యం బీటెక్‌ సర్టిఫికెట్లు ఇచ్చింది. 2020లో తిరుపతిలో మెగా జాబ్‌మేళాకు ఎంపికై రూ.9 లక్షల ప్యాకేజీ అందుకున్నాను. ఆ కంపెనీ ప్రతినిధులు అమెరికాకు పంపించారు. ప్రస్తుతం నేను రూ.25 లక్షల ప్యాకేజీతో పనిచేస్తున్నాను. ‘‘ మళ్లీ నిన్ను సీఎంగా చూడాలి.. హ్యాపీ బర్త్‌డే టూ యూ జగనన్న’’

– శ్రావణి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement