నేడు పల్స్‌పోలియో
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం జరగనుంది. 5 ఏళ్ల లోపు పిల్లలకు రెండు చుక్కలు వేయనున్నారు. ఇందు కు గాను 50 పీహెచ్‌సీ, 15 అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో 2,21,502 మంది ఐదేళ్ల లోపు పిల్లలను గుర్తించారు. 142 రూట్లల్లో 1415 బూత్‌లను ఏర్పాటు చేశా రు.ఈ బూత్‌లలో పిల్లలకు చుక్కలు వేసేందుకు 5800 వ్యాక్సినేటర్లను నియమించారు. 2830 మందితో ఇంటింటా పర్యటనకు కేటాయించారు. జిల్లా కేంద్రానికి 7 లక్షలు డోస్‌లు చేరుకున్నాయి. వీటిని చిత్తూరు జిల్లా తో పాటు తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు కూడా అందజేయనున్నామని డీఐఓ హనుమంతరావు పేర్కొన్నారు.
నిండు జీవితానికి రెండు చుక్కలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి అన్నారు. చిత్తూరు నగరంలో పోలియో చుక్కల కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కలసి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి అక్కడ మానవహారం, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ, మేయర్ అముద మాట్లాడుతూ.. పిల్లలందరికీ ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. చుడా చైర్మన్ కఠారి హేమలత, డీఐఓ హనుమంతరావు, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, సూపరింటెండెంట్ ఉషశ్రీ, ఆర్‌ఎంఓ సంధ్య, వైద్యాధికారులు లోకేష్, ప్రవీణ, గిరి, అనూష పాల్గొన్నారు.


