పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తాం
తవణంపల్లె : మండల కేంద్రంలో మునగ ఆకుతో తయారు చేసే పౌడర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి స్పష్టం చేశారు. శనివారం తవణంపల్లె వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారులతో మునగ పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీదేవి మాట్లాడుతూ.. తవణంపల్లె రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీఓ) భవనంలో ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రైతులు మునగ సాగు చేయడంలో మెలకువలు గురించి వివరించారు. ఉద్యానవన శాఖ ఏడీ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు మునగ సాగుపై అవగాహన కల్పించారు. మాట్లాడుతూ ఆసక్తి కలిగిన రైతులు ఉపాధిహామీ పథకం కింద మునగ సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కేశవులు, ఎల్‌హెచ్ ఏపీఎం రమణ, ఏపీఎంలు నాగరత్న, ఈశ్వరి, అరుణ, రవి, రవికుమార్, సంగన్న, ఏపీఓ బాల సీసీలు, రైతు ఉత్పత్తిదారులు ,హైదరాబాద్ ఎ–1 ఇండస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.


