104 ఉద్యోగులపై వేధింపులు తగదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : 104 ఉద్యోగులపై యాజమాన్య వేధింపులు తగదని 104 ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు విక్టర్ మండి పడ్డారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట శనివారం 104 ఉద్యోగుల సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపులో యాజమాన్యం కోత పెట్టిందన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం వేతనం రూ.18,500 ఇవ్వాలన్నారు. 5 ఏళ్లు సర్వీసు దాటిన వారికి స్లాబ్ మార్చి వేతనాలు చెల్లించాలన్నారు. రద్దు చేసిన క్వాజువల్ లీవులు పునరుద్ధించాలన్నారు. మందులు 104లోనే అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్ గిరిధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సభ్యులు భాస్క ర్, శ్రీకాంత్, మణికంఠ తదితరులున్నారు.


