టెట్‌కు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

టెట్‌కు ఉచిత శిక్షణ

Oct 31 2025 7:53 AM | Updated on Oct 31 2025 7:53 AM

టెట్‌కు ఉచిత శిక్షణ

టెట్‌కు ఉచిత శిక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌ : టెట్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చిత్తూరు కుట్టి డీఎస్సీ శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ పవనకుమారి తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. సబ్జెక్టు నిపుణులచేత 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తరగతులు నవంబర్‌ 2 నుంచి పలమనేరు కుట్టి కోచింగ్‌ సెంటర్‌లో ప్రారంభమవుతాయన్నారు. శిక్షణలో అతి సులభంగా టెట్‌ క్వాలిఫై అవ్వడం ఎలా? ఏయే పుస్తకాలు చదవాలి? ప్రిపరేషన్‌ విధానం ఎలా? అనే అంశాలపై నిపుణులు విశ్లేషిస్తారన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు కోచింగ్‌ సెంటర్‌లో పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. వివరాలకు 9491844963 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

ఇంటి గోడ కూలి..

రొంపిచెర్ల: ఇంటి గోడ కూలింది. భార్యాభర్తల కు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన రొంపిచెర్ల మండలం, బుసిరెడ్డిగారిపల్లెలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొండ్ల నారాయణ, పద్మావతి దంపతులు ఇంట్లో నిద్రిస్తున్నారు. ఒక్క సారిగా పెద్దశబ్దంతో గోడ కూలిపోయింది. భార్యాభర్తలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ తడిసి మొత్తబడి కూలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఆలయ హుండీ చోరీ

శ్రీరంగరాజపురం : మండలంలోని పల్లేరుకాయకోనలో వెలసిన శ్రీ ఆత్మలింగేశ్వరస్వామి ఆలయ హుండీని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆలయ ధర్మ కర్త మోహన్‌నాయుడు కథనం.. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ హుండీని పగులగొట్టి అందులోని నగదును దొంగలించారు. ఆలయానికి వెళ్లే మార్గంలో ఓ వైన్‌షాప్‌ ఉంది. ఇక్కడ మందు బాబుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తాగిన మైకంలోనే కొందరు ఆలయ హుండీని చోరీ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు.

పాఠశాలలకు క్రీడా కిట్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసి న ప్రభుత్వ పాఠశాలలకు క్రీడాసామగ్రి కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సమగ్రశిక్షాశాఖ ఆధ్వర్యంలో కిట్లను సరఫరా చేస్తున్నా రు. 67 రకాల క్రీడాసామగ్రి బ్రాండ్‌లతో కూడిన కిట్లను పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న క్లస్టర్‌ పాయింట్లకు వాటిని అందించనున్నారు. ఆ తర్వాత సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేయాలని ఆదేశించారు.

రూ.1,97 కోట్లకు పైగా ఆదాయం

కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని పలు పనులకు గురువారం టెండర్లు నిర్వహించారు. 13 పనులకు టెండర్లు పిలు వగా ఆరు టెండర్లు పూర్తయ్యాయి. పాలు విక్రయానికి సంబంధించిన టెండర్‌ ద్వారా రూ.9.31 లక్షలు, కొబ్బరి చిప్పల పోగుకు రూ.69,00,309, నేతి దీపాల విక్రయానికి రూ.68,00,999, 2026 సంవత్సర క్యాలెండర్లు ముద్రణ, విక్రయానికి రూ.38లక్షలు, విఘ్నేశ్వర కల్యాణ మండపం వద్ద బంకు న్విహణకు రూ.4.23లక్షలు, శివాల యం ముందర బంకు నిర్వహణకు రూ. 9.10 లక్షల చొప్పున టెండర్లు పాడారు. తద్వారా రూ.1.97,65,308ల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ టెండర్‌ నగదును శుక్రవారం సా యంత్రానికి వేలంపాట దారులు ఆలయ బ్యాంకు ఖాతాలో జమచేసేలా ఆదేశాలిచ్చామని ఆయ న పేర్కొన్నారు. ఏఈఓలు ప్రసాద్‌, రవీంద్రబాబు, ఎస్‌వీ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్‌ బాలరంగస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement