 
															చంద్రబాబుకు ఏ వర్గంపై కూడా ఆపేక్ష లేదు
సాక్షి, అమరావతి: మోంథా తుపాను సహాయక చర్లల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. కానీ ప్రచార్భాటంలో మాత్రం హంగామా చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. ఆయనకు ఏ వర్గంపైన కూడా ఆపేక్ష లేదు. వ్యవసాయం దండగ అని గతంలో చంద్రబాబే స్వ యంగా చెప్పాడు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల్ని గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సీఎం చంద్రబాబు మనల్ని మర్చిపోయినా వైఎస్ జగన్ మాత్రం మనల్ని గుర్తుపెట్టుకుని మా పక్షాన పోరాడుతున్నాడని మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎంతో కష్టపడి మన హయాంలో కుప్పం నియోజకవర్గానికి నీళ్లిస్తే ఆరోజున కాలువలో కూర్చుని చంద్రబాబు ధర్నా చేశాడు. రైతులు నీళ్లొద్దు అనుకుంటున్న సమయంలో చంద్రబాబు నీళ్లు తీసుకుపోయి నేనే నీళ్లిచ్చా, చెరువులు నింపానని ప్రచారం చేసుకుంటున్నాడు’’అని అన్నారు.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు గడువు పొడిగింపు
తిరుపతి సిటీ: 2026–27 విద్యా సంవత్సరానికి సైనిక్ స్కూళ్లలో 6, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల సమర్పణ గడువును నవంబర్ 9వ తేదీ వరకు పొడిగించారని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం అధినేత డాక్టర్ యన్.విశ్వనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష జనవరి 18వ తేదీన జరుగుతుందని తెలిపారు. అర్హత లు, పరీక్షా విధానం గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు వరదరాజనగర్‌లోని విశ్వం కోచింగ్ సెంటర్‌లోగానీ, 86888 88802, 93999 76999 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
29,186 మంది
పరీక్ష ఫీజు చెల్లింపు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యాసంవత్సరంలోఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల్లో ఈ నెల 30వ తేదీ వరకు 29,186 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించేందుకు ఈ నెల 31 వరకు రాష్ట్ర ఇంటర్మీడియెట్ అధికారులు అవకాశం కల్పించారు. కాగా జిల్లా లోని అన్ని యాజమాన్యాల ఇంటర్మీడియెట్ కళాశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం 15,098, ద్వితీయ సంవత్సరం 15,354 మొత్తం 30,452 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఈనెల 30 వరకు మొదటి సంవత్సరం 14,710, ద్వితీయ సంవత్సరం 13,760 పరీక్ష ఫీజు చెల్లించగా మిగిలిన 1,266 మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. కాగా ప్రస్తుత విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ట్లు రాష్ట్ర ఇంటర్మీడియెట్ అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు.
వరసిద్ధుని సేవలో
కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని గురువారం కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ నటరాజ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం పండితుల ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీనాయుడు, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
 
							చంద్రబాబుకు ఏ వర్గంపై కూడా ఆపేక్ష లేదు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
