 
															మేత భూమిని మేసేశారు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తప్పుడు రికార్డులు సృష్టించి మేత భూమిని...టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారని పెద్దిశెట్టిపల్లికి చెందిన లక్ష్మణుడు ఆరోపించారు. చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు మండలం, పెద్దిశెట్టిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత పురుషోత్తం 1.68 ఎకరాల భూమిని ఆక్రమించుకుని.. మామిడి చెట్లు పెట్టుకున్నాడని తెలిపారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే... రెవెన్యూ అధికారులు మామిడి చెట్లు తొలగించి..మేత భూమిగా బోర్డు పెట్టాలని ఆదేశించారన్నారు. తర్వాత తమిళనాడుకు చెందిన మహేశ్వరి కూడా రెవెన్యూ అధికారుల సహకారంతో 2.30 ఎకరాల మేత భూమిని తప్పుడు రికార్డులతో ఆక్రమించాడని తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని లక్ష్మణుడు పేర్కొన్నాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
