 
															ఆశలపై మోంథా పడగ
పుంగనూరు: మోంథా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మండలంలో 60 ఎకరాల్లో టమాటా నేలమట్టమైంది. ముఖ్యంగా మాగాండ్లపల్లి, రాగానిపల్లి, మంగళం, చదళ్ల, బండ్లపల్లె, అరవపల్లి ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా 25 ఎకరాల్లో చామంతి, బంతిపూల తోటలు నాశనమయ్యాయి. 11 ఎకరాల్లో కాలీ ఫ్లవర్ నేలమట్టమైంది. సోమల, సదుం మండలాల్లో వరి 11 ఎకరాలలో దెబ్బతినింది. టమాటా సాగు చేయడానికి ఎకరాకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశామని, భారీ వర్షా లకు పంట దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయి నట్టు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ వరప్రసాద్ మాట్లాడుతూ పరిశీలించి నివేదికలు పంపుతామని తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
