 
															క్రీడాకారులకు ఉజ్వల భవిత
శ్రీరంగరాజపురం : మండలంలోని ఆరిమాకులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సెపక్‌తక్ర క్రీడా పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. హెచ్‌ఎం కళావతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమన్నారు. క్రీడల్లో మానసికోల్లాసంతోపాటు మెద డు చురుగ్గా పనిచేస్తుందని చెప్పారు. జిల్లా స్థాయి లో ఎంపికై న విద్యార్థులకు అనంతపురం జిల్లా, ఉరవకొండలో నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. క్రీడాపోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి న విద్యార్థులను ఉపాధ్యాయులు లోకనాథం, శర త్, సురేష్, దేవానందం, లోకేశ్వరి, హరి, మోహన్, గంగాధరం, బాలజీ, చంద్రశేఖర్, బాబు, పద్మశ్రీ, సరోజమ్మ, జానకి, సత్య, అరుణకుమారి, ప్రసన్నకుమారి, మహేష్ తదితరులు అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
