సేవలే చిరస్మరణీయం
చిత్తూరు కలెక్టరేట్ : ఒక ఐఏఎస్ అధికారి తలచుకుంటే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు...ఎంతో మంది పేద ప్రజలకు విశేష సేవలందించవచ్చు....అలాంటి సేవలు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన కలెక్టర్‌లలో దివంగత ఎం.నాగార్జున ఒకరు. ఆయన 1990–91 వ సంవత్సరంలో అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆయన పనిచేసే సమయంలో జిల్లాలో విద్యాభివృద్ధికి అవసరమైన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తుగా ప్రస్తుతం కలెక్టరేట్‌లో అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్‌కు ఎం.నాగార్జున పేరును పెట్టారు. ఆ కాన్ఫరెన్స్ హాల్‌ను బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నూతన హాల్‌కు దివంగత ఐఏఎస్ అధికారి నాగార్జున పేరును పెట్టడం సంతృప్తినిచ్చిందన్నారు. ప్రారంభ కార్యక్రమంలో డీఆర్‌ఓ మోహన్‌కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, ఆర్‌డీవో శ్రీనివాసులు, చిత్తూరు తహసీల్దార్ కులశేఖర్, కలెక్టరేట్‌లోని పలు విభాగాల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


