డెల్ఫీ టీవీఎస్‌తో ఎంఓయూ
పుత్తూరు: చైన్నెకి చెందిన ప్రముఖ డెల్ఫీ టీవీఎస్ కంపెనీతో పుత్తూరులోని పిళ్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మెమొరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంఓయూ) కుదుర్చుకుంది. బుధవారం డెల్ఫీ టీవీఎస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగరాజన్ బృందం పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించింది. ఈసందర్భంగా ఇరు వర్గాల మద్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఎంఓయూపై సంతకాలు చేశారు. ప్రిన్సిపల్ ఎస్వీకుమార్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగ అవకా శాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్లేస్‌మెంట్ ఆఫీసర్ వేలాయుధాచ్చారి, విభాగాధిపతు లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


