డిప్యూటీ సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపు
చిత్తూరు కార్పొరేషన్ : భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం కార్యాలయం ముట్టడించేందుకు సిద్ధం కావాలని ఏపీ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ పిలుపునిచ్చారు. ఆ సంఘ నాయకులు బుధవారం జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు చట్టం 1996ను పటిష్టంగా అమలుచేస్తూ వెల్ఫేర్ బోర్డు ద్వారా పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించారన్నారు. హామీల పరిష్కారానికి త్వరలో డిప్యూటీ సీఎం కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఈ ముట్టడికి కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు నాగరాజు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాములు, నాయకులు గోపీనాథ్, దాసరి చంద్ర, మణి, శ్రీనివాసులు పాల్గొన్నారు.


