వెట్టి నుంచి కుటుంబానికి విముక్తి | - | Sakshi
Sakshi News home page

వెట్టి నుంచి కుటుంబానికి విముక్తి

Oct 29 2025 7:59 AM | Updated on Oct 29 2025 7:59 AM

వెట్టి నుంచి కుటుంబానికి విముక్తి

వెట్టి నుంచి కుటుంబానికి విముక్తి

గంగాధర నెల్లూరు : ఇటుక బట్టీలో వెట్టి చాకిరి చేయిస్తూ కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులు పెడుతున్న యజమాని నుంచి ఓ కుటుంబాన్ని జీవన జ్వాల సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వాధికారులు విముక్తి కలిగించారు. గంగాధర నెల్లూరు మండలంలోని బుక్కపట్నం గ్రామం గుట్ట వద్ద పుష్పరాజ్‌ అనే ఇటుకల వ్యాపారి తమిళనాడు రాష్ట్రం నుంచి ఓ కుటుంబాన్ని 37 వేల రూపాయల అడ్వాన్స్‌ ఇచ్చి ఇటుకల బట్టిలో పనిచేయడానికి రప్పించుకున్నారు. సంవత్సరాల గడుస్తున్నా ఇంటికి పంపించకుండా కూలి డబ్బు ఇవ్వకుండా నిర్బంధించి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, జీవన జ్వాల సంస్థ ప్రతినిధులకు ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించగా స్పందించిన ఆర్డీఓ స్థానిక తహసీల్దార్‌కు తక్షణమే వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్‌ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది బుక్కాపట్నం గుట్ట వద్దకు చేరుకుని వెట్టి చాకిరి నుంచి కుటుంబాన్ని విముక్తి చేశారు.

చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మంగళవారం చెరువు కట్ట వైపు వెళుతున్న వారు.. నీటిలో తేలుతున్న ఓ మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందజేశారు. శవం బాగా కుళ్లి ఉండటంతో ఇది వారం కిందట జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు దాదాపు 35 ఏళ్లు ఉంటుందని, ఇతడి కుడిచేతిపై ఆంగ్లంలో అను పేరిట పచ్చబొట్టు ఉందని వన్‌టౌన్‌ సీఐ మహేశ్వర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా మృతుడి వివరాలు తెలిస్తే 9440796707 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఎన్‌ఎస్‌యూలో అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాలు

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై, ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత సమాజ నిర్మాణమే ఈ విజిలెన్‌న్స్‌ అవేర్నెస్‌ వీక్‌ ముఖ్యోద్దేశం అని, ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి సమాజహితం కోసం పనిచేయాలని, విశ్వవిద్యాలయాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో కృషషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement