సక్రమంగా బిల్లులు పెడితేనే పనిచేయండి
గుడుపల్లె: ఉపాధి పథకంలో చేస్తున్న పనులకు సక్రమంగా మస్టర్లు, బిల్లులు పెడితేనే పనిచేయాలని పీడీ రవికుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 19వ ఉపాధి పథకం సామాజిక తనిఖీ బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకంలో కూలీలకు సక్రమంగా ఇచ్చే బిల్లులకు సంబంధించి మస్టర్లలో సంతకాలు సేకరించి రికార్డులు సంక్రమంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు మండలంలోని 18 గ్రామ పంచారయతీల్లో జరిగిన ఉపాధి పనులపై బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ పంచాయతీల్లో బిల్లులు పెట్టినా కూడా మస్టర్లలో సంతకాలు లేకుండా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పథకంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఉపాధి హామీకి సంబంధించి రూ.44 వేలు రికవరీ చేశామన్నారు. మిగిలిన నగదును వారంలోపు చెల్లించాలని తెలిపారు. ఏపీఓ అనీల్‌కుమార్, ధనయ్య, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెట్లు తదితరులు పాల్గొన్నారు.


